: ఆట కోసం వెళ్లి అత్యాచారం... అమెరికాలో అరెస్టయిన భారత అథ్లెట్
ఆటల పోటీల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన భారత అథ్లెట్ తన్వీర్ హుస్సేన్ ను అక్కడి పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలోని సారనాక లేక్ విలేజ్ లో 12 సంవత్సరాల బాలికను రేప్ చేసినట్టు తన్వీర్ పై పోలీసులు అభియోగాలను నమోదు చేశారు. ఈ విషయాన్ని స్నో షూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేస్తూ, అతని అరెస్టు వాస్తవమని, ఏం జరిగిందన్నది తెలుసుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. కాగా, గత నెల 23 నుంచి 25 వరకూ ప్రపంచ స్నో షూ చాంపియన్ షిప్ పోటీలు జరుగగా, తన్వీర్ వాటిల్లో పాల్గొన్నాడు. వాస్తవానికి గురువారమే అతను తిరిగి ఇండియాకు బయలుదేరాల్సివుండగా, అత్యాచార ఆరోపణలు రావడంతో బుధవారం నాడు ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, తను నేరం చేయలేదని హుస్సేన్ చెబుతుండటం గమనార్హం.