: రైలు టికెట్ల బుకింగ్‌లో మోసాలకు అడ్డుకట్ట.. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి


రైలు టికెట్ల బుకింగ్‌లో పెరిగిపోతున్న మోసాలను అరికట్టేందుకు రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆన్‌లైన్‌లో చేసుకునే టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. గురువారం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆవిష్కరించిన రైల్వే సంబంధ నూతన వ్యాపార ప్రణాళిక 2017-18లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఐఆర్‌సీటీసీ ద్వారా ఇంటర్నెట్‌లో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ నంబర్ నమోదు చేయడం తప్పనిసరి అని అందులో పేర్కొన్నారు. వయోవృద్ధులు టికెట్‌పై రాయితీ పొందాలంటే ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నంబరు సమర్పించాల్సి ఉంటుందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజా ప్రణాళిక ప్రకారం.. ప్రస్తుతం రైల్వేలో ఒక్కో సదుపాయానికి ఒక్కో యాప్ అందుబాటులో ఉంది. ఇకనుంచి అన్ని సేవలను ఒకేదాంట్లో అందించేలా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మే నెల నుంచి ఇది అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఆరువేల పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్), వెయ్యి స్వీయ టికెట్ విక్రయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సరుకు రవాణాపై ఆదాయాన్ని పెంచుకునేందుకు రాయితీలు ప్రకటించింది. కొండ ప్రాంతాల్లోని స్టేషన్లను కలుపుతూ ప్రత్యేకంగా కొత్త రైళ్లను ప్రారంభించనుంది.


 

  • Loading...

More Telugu News