: మరో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్న వీవీఎస్ లక్ష్మణ్
హైదరాబాద్ లో రెండో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నట్టు టీమిండియా మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఈ క్రికెట్ శిబిరాన్ని నెలకొల్పామని, ఏప్రిల్ 3వ తేదీ నుంచి శిక్షణ శిబిరం మొదలవుతుందని చెప్పాడు. శిక్షణ నిమిత్తం వచ్చే చిన్నారులపై ప్రయాణ భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వేర్వేరు చోట్ల మరో రెండు అకాడమీలు వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మణ్ తెలిపాడు. ఈ సందర్భంగా శ్రీనిధి పాఠశాలలో నెలకొల్పిన తొలి అకాడమీ గురించి ప్రస్తావించారు. ఇక్కడ 90 మంది శిక్షణ పొందుతున్నారని లక్ష్మణ్ చెప్పాడు.