: నా కెరీర్ లో ఎవరినీ పోటీగా నిర్దేశించుకోలేదు: రోహిత్ శర్మ


తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎవరినీ తనకు పోటీగా నిర్దేశించుకోలేదని, తనకు తానే పోటీ అని క్రికెటర్ రోహిత్ శర్మ అన్నాడు. కాలికి శస్త్ర చికిత్స అనంతరం నాలుగు నెలల తర్వాత రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఈ నెల 4న ఆంధ్రా జట్టుతో జరిగే మ్యాచ్ లో రోహిత్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో రోహిత్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు. ఎవరితోనైనా పోటీ పడితే ఒక ఆటగాడిగా ప్రగతి సాధించలేమని, అందుకే, తన కెరీర్ లో ఎవరినీ పోటీగా నిర్దేశించుకోలేదని అన్నాడు. ప్రస్తుతం వందశాతం ఫిట్ నెస్ తో ఉన్నానని చెప్పిన రోహిత్ శర్మ, భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో తనకు ఆడాలని ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News