: గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత నెల 6 వేల ఉద్యోగాలతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేసి అందుకోసం దరఖాస్తులు కూడా తీసుకుంటోంది. అయితే, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిబంధనలపై ఓయూ విద్యార్థులతో పాటు ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నిబంధనల్లో సవరణల కారణంగా ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సవరణలు చేసిన తర్వాత మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పేర్కొంది.