: పూణే టెస్ట్ ఓటమిపై ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించలేం: చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ల మధ్య పూణేలో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ అందుకు కారణం పరిస్థితులను అనుకూలపరుచుకోవడంలో విఫలమవ్వడమేనని అన్నారు. ఈ మ్యాచులో పరిస్థితులకు తగ్గట్లు ఆడడంతో ఆస్ట్రేలియా విజయం సాధించిందని చెప్పారు. ఆ మ్యాచులో కోహ్లీ సేన తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేదని, ప్రస్తుతం బెంగళూరులో ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్‌పైనే తమ దృష్టి పెట్టామని తెలిపారు. పూణే టెస్ట్ ఓటమిపై ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించలేమని ఆయన పేర్కొన్నారు.