: సోషల్ మీడియాలోకి రావాలనుకునేవారికి అమితాబ్ సూచన
ఈ రోజుల్లో సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలోకి రావాలనుకుంటున్న వారికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఉండాలనుకునే వారు కేవలం ప్రశంసలనే కాదు... విమర్శలను సైతం స్వీకరించేలా ఉండాలని ఆయన అన్నారు. తాను కూడా ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఆస్వాదిస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో అమితాబ్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను తెలియజేయడమే కాకుండా, పలు సామాజిక అంశాలపై కూడా ఆయన స్పందిస్తుంటారు.
ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ ఉదంతంపై కూడా ఆయన స్పందించారు. ఇది ఆమె వ్యక్తిగత విషయమని... దాని గురించి తాను మాట్లాడితే బహిరంగమవుతుందని అన్నారు.