: సైకిళ్లు తొక్కుతూ గ్యాస్ సిలిండర్లతో అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలు


నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్‌ ధరపై మ‌రో రూ.86 పెంచుతున్న‌ట్లు నిన్న‌ పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ధర పెంపును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాస‌న‌స‌భ్యులు ఈ రోజు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీతూ పట్వారీ స‌హా ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంద‌రూ క‌లిసి, సైకిళ్లు ఎక్కారు. వెన‌కాల గ్యాస్ సిలిండర్లను పెట్టుకొని సైకిళ్ల‌ను తొక్కుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News