: సల్మాన్ ఖాన్ సినిమాలపై విమర్శలు గుప్పించిన పాక్ నటి


ఒకప్పుడు బాగానే ఉన్న లాలీవుడ్ (పాకిస్థాన్ ఫిలిం ఇండస్ట్రీ) క్రమంగా కళ తప్పింది. అక్కడి ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాల వైపు మొగ్గు చూపడమే దీనికి కారణం. ఇదే సమయంలో పాక్ నటీనటులను, గాయనీగాయకులను, టెక్నీషియన్స్ ను బాలీవుడ్ ఆదరించింది. కానీ, బాలీవుడ్ ఎదుగుతోందనే అక్కసు మాత్రం అక్కడివారిలో ఉంది. కొన్ని సందర్భాల్లో తమ అక్కసును వారు వెళ్లగక్కుతూనే ఉంటారు.

తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాలపై పాక్ నటి, గాయని రబీ పీర్జాదా విమర్శలు గుప్పించింది. సల్మాన్ సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందని... ఆయన సినిమాలు నేరాలను ప్రోత్సహిస్తాయని ఆమె విమర్శించింది. అంతేకాదు, బాలీవుడ్ లో విడుదలయ్యే ప్రతి సినిమాలో కూడా క్రైమ్ గురించే ఉంటుందని చెప్పింది. యువతకు ఏం నేర్పుతున్నారో ఇండియన్ ఫిల్మ్ మేకర్లు చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. సామాజిక అంశాలు, నీతి కథలతో ఒకప్పుడు పాక్ సినీ పరిశ్రమ ఎంతో గొప్పగా ఉండేదని... కానీ, బాలీవుడ్ దాన్ని పూర్తిగా నాశనం చేసిందని మండిపడింది.

  • Loading...

More Telugu News