: కమలహాసన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ముచ్చటించిన క్వీన్ ఎలిజబెత్


విలక్షణ నటుడు కమలహాసన్ ఇంగ్లండ్ రాణి క్వీన్ ఎలిజబెత్-2ను కలుసుకున్నారు. బకింగ్ హామ్ ప్యాలస్ లో ఆమె ఏర్పాటు చేసిన 'యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్' కార్యక్రమంలో ఆమెతో కమల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమలహాసన్ కు క్వీన్ ఎలిజబెత్ షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆయనతో కాసేపు ముచ్చటించారు. క్వీన్ ఎలిజబెత్-2ను కమల్ కలుసుకోవడం ఇది రెండోసారి. 1997లో ఆమె భారత పర్యటనకు విచ్చేసినప్పుడు... కమల్ సినిమా 'మరుదనాయగం' షూటింగ్ సెట్స్ కు క్వీన్ వచ్చారు.

ఈ సందర్బంగా క్వీన్ ను తాను కలిసిన విషయాలను కమల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. క్వీన్ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అక్కడ చాలా మంది ఉండటంతో, ఎక్కువసేపు ఆమెతో మాట్లాడలేక పోయానని తెలిపారు. భారత్ వచ్చినప్పుడు ఆమె నా షూటింగ్ సెట్స్ కు వచ్చిన సంగతి మీకు గుర్తుండే ఉంటుందని అన్నారు. తనకు తెలిసినంత వరకు ఒక ఫిల్మ్ షూటింగ్ కు క్వీన్ హాజరైన సందర్భం అది ఒక్కటే అయ్యుంటుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News