: ఉచిత దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేవాడిని: ‘జబర్దస్త్’ నటుడు సుడిగాలి సుధీర్
తాను చిన్నప్పటి నుంచి ఉచిత దర్శనంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకునేవాడినని ‘జబర్దస్త్’ నటుడు సుడిగాలి సుధీర్ అన్నాడు. తిరుమల శ్రీవారిని ‘జబర్దస్త్’ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ నిన్న దర్శించుకున్నారు. అనంతరం, సుధీర్ మీడియాతో మాట్లాడుతూ, ‘జబర్దస్త్’ కార్యక్రమంతో తనకు గుర్తింపు రావడంతో తనకు మంచి దర్శనం లభించిందని అన్నాడు. శ్రీ వేంకటేశ్వరుడి ఆశీస్సుల వల్లే ఈ రోజు తాను ఈ స్థాయికి రాగలిగానని అన్నాడు. అనంతరం నటుడు రాంప్రసాద్ మాట్లాడుతూ, తాను కూడా తిరుమల శ్రీవారి భక్తుడినని, ఏడుకొండల వాడి దయ వల్లే ఈ స్థాయికి వచ్చానని అన్నాడు.