: యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని పట్టేశారా?... ఎయిర్ పోర్టులో మరో పరీక్ష రాయాల్సి రావచ్చండోయ్!


ఉన్నత విద్యను అభ్యసించి, గొప్ప కంపెనీల ప్రతినిధుల ముందు ఒద్దికగా కూర్చుని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాన్ని ఇచ్చి, ఆకర్షణీయమైన వేతనంతో అమెరికాలో ఉద్యోగాన్ని పట్టేశారా? మీరు అమెరికాలో కాలు పెట్టాలంటే, ఎయిర్ పోర్టులో మీకు ఇమిగ్రేషన్ అధికారులు మరో పరీక్ష పెట్టే అవకాశాలు ఉన్నాయండోయ్. యూఎస్ అధికారులు, తమ దేశానికి వస్తున్న టెక్కీలకు మరోసారి పరీక్ష నిర్వహించడం ఇప్పటికే మొదలు పెట్టేశారని తెలుస్తోంది.

నైజీరియా నుంచి న్యూయార్క్ వెళ్లిన ఓ యువకుడిని, నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజనీరువా? అని ప్రశ్నించిన అధికారులు, కాగితం, పెన్నూ ఇచ్చి, బైనరీ సెర్చ్ ట్రీ, అబ్ స్ట్రాక్ట్ క్లాస్ కు సంబంధించిన ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయమన్నారు. అండెలా అనే టెక్నాలజీ స్టార్టప్ లో పనిచేస్తున్న సెలెస్టిన్ (28) అనే ఈ యువకుడు తొలుత షాక్ తిని, ఆపై ప్రశ్నలకు జవాబులు రాశాడు. తన జవాబులతో ఇమిగ్రేషన్ అధికారులు సంతృప్తి చెందలేదని, తనను వెనక్కు పంపుతారని భయపడుతుండగా, అదృష్టవశాత్తూ, తన దేశం ప్రయాణ నిషేధ జాబితాలో లేకపోవడంతో అనుమతించారని సెలెస్టిన్ చెప్పాడు. అదీ సంగతి. ఇదే అనుభవం ఎవరికైనా ఎదురుకావచ్చు. ఎవరి జాగ్రత్తలో వారుండాల్సిందే.

  • Loading...

More Telugu News