: జస్టిన్ బీబర్ తో కలిసి చిందేయనున్న సన్నీ లియాన్!
ఈ సంవత్సరం మేలో 'పర్పస్ వరల్డ్ టూర్' పేరిట ఇంటర్నేషనల్ మ్యూజిక్ సెన్సేషన్ జస్టిన్ బీబర్, ముంబైలో ప్రత్యేక సంగీత ప్రదర్శన నిర్వహిస్తుండగా, ఆయనతో కలిసి వేదికను పంచుకునే అవకాశం సన్నీ లియాన్ దక్కించుకుందని తెలుస్తోంది. సన్నీతో పాటు ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్ధ మల్ హోత్రా తదితరులు కూడా బీబర్ తో కలసి ఈ షోలో పాల్గొనవచ్చని 'మిడ్ డే డాట్ కామ్' వెల్లడించింది. ఈ కార్యక్రమానికి హాజరై, బీబర్ తో కలసి నృత్యం చేసేందుకు సన్నీ అంగీకరించినట్టు కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారని తెలిపింది. కాగా, మే 10న జరగనున్న ఈవెంటుకు కనీస టికెట్ ధర రూ. 4 వేలు కాగా, అమ్మకాలు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.