: ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు?


ఈ నెల 6వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పై కాగితాలు, పుస్తకాలు విసిరేశారని, అసెంబ్లీ కార్యదర్శి పట్ల దురుసుగా ప్రవర్తించారని, మార్షల్స్ పై దాడికి దిగారని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ సభాహక్కుల కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో, వీరిపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మొత్తం 12 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఈ చర్యలకు దిగారని గుర్తించి, వారిని విచారణకు పిలిచింది సభాహక్కుల కమిటీ. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు జరిగిన పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసి, క్షమాపణలు చెప్పారు. మిగిలిన వారు మాత్రం క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. ఈ ఐదుగురిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, సునీల్ కుమార్, ముత్యాల నాయుడు ఉన్నారు. వీరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. 

  • Loading...

More Telugu News