: పెళ్లయిన మహిళపై మనసు పారేసుకున్నాడు... ఆమె కొడుకును కిడ్నాప్ చేసి అరెస్టయ్యాడు!
ఆమెకు పెళ్లయింది.. ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆమే కావాలని కోరుకొని నేరానికి పాల్పడ్డ ఓ వ్యక్తి చివరకు అరెస్టు అయ్యాడు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ వాసి అయిన ఆకాశ్ అనే వ్యక్తి తన ఆఫీసులో పనిచేస్తోన్న ఓ మహిళపై మనసు పారేసుకున్నాడు. తాను ప్రేమిస్తోన్న మహిళకు మూడేళ్ల బాబు కూడా ఉన్నాడని తెలిసినా అదే పనిచేశాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె మూడేళ్ల కొడుకుని అపహరించాడు. తన పిల్లాడు కనిపించకపోవడంతో కంగారు పడిపోయిన ఆ మహిళ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు ఆకాశే కిడ్నాప్ చేసినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.