: 9వ తరగతి విద్యార్థితో ప్రేమాయణం... పారిపోయిన టీచరమ్మ!
తన వద్దకు వచ్చే పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న ఓ టీచరమ్మ, దాన్ని మరచి, విద్యార్థితో ప్రేమాయణం నెరిపింది. రెండేళ్లుగా తన వద్దకు ట్యూషన్ నిమిత్తం వస్తున్న 17 ఏళ్ల బాలుడిని లోబరచుకుని అతనితో కలిసి పరారైంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గిలో చర్చనీయాంశమైంది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు మొదలు పెట్టారు. సదరు టీచరుకు ఇదివరకే వివాహమైందని, 10, 12 సంవత్సరాల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, భర్త నుంచి విడాకులు పొందిందని తెలిపారు. వీరు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.