: ఫ్రీ కాల్స్ అపరిమితమే: తేల్చి చెప్పిన జియో
జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి మొదటి 1000 నిమిషాలు మాత్రమే ఉచితమని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ చెప్పడాన్ని రిలయన్స్ జియో ఖండించింది. ఇలా పేర్కొనడం సరికాదని, తమ వినియోగదారులు, రూ. 99తో వార్షిక సభ్యత్వం స్వీకరించిన తరువాత ఎంచుకున్న నెలవారీ రీచార్జ్ తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుకోవచ్చని స్పష్టం చేసింది. రూ. 149, రూ. 303, రూ. 499 రీచార్జ్ లతో నెల రోజులు అన్ని కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చని, డేటా మాత్రం మారుతుంటుందని తెలిపింది. మై జియో యాప్ లో అన్ని వివరాలను పొందుపరిచామని పేర్కొంది.