: 'బాహుబలి: ది కన్ క్లూజన్' ట్రైలర్ రెడీ: సెంథిల్ కుమార్


ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి: ది కన్ క్లూజన్' అనడంలో సందేహం లేదు. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతుండగా, తాజాగా చిత్రం ట్రైలర్ రెడీ అయిందని, ప్రస్తుతం ఇది తెరపై ఎలా ఉందన్న విషయాన్ని పరీక్షిస్తున్నామని చిత్రం సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో ట్రైలర్ తయారైందని చెబుతూ, దీన్ని పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు సెంథిల్. ఈ సినిమాపై వర్క్ చేస్తున్నామని, సీవీ రావు, శివకుమార్ లతో కలసి తెరపై ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చూస్తున్నామని కామెంట్ పెట్టాడు. కాగా, మరో పది రోజుల్లో ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.

  • Loading...

More Telugu News