: బ్యాంకుల తాజా 'వడ్డన'లపై వెల్లువెత్తున్న విమర్శలు
తమ ఖతాదారులు నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చని, డబ్బు డిపాజిట్ అయినా, విత్ డ్రా అయినా నాలుగు కన్నా ఎక్కువ సార్లు లావాదేవీలు జరిపితే, రూ. 150 వసూలు చేస్తామని హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ప్రకటించంపై కస్టమర్లు మండిపడుతున్నారు. ఈ కొత్త చార్జీల నిబంధన వేతన ఖాతాలు, పొదుపు ఖాతాలు సహా అన్ని రకాల ఖాతాలకూ వర్తిస్తాయని బ్యాంకులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం దారుణమని పలువురు బ్యాంకు ఖాతాదారులు వాపోయారు.
ఇక థర్డ్ పార్టీ నగదు లావాదేవీలపై రూ. 25 వేల పరిమితిని కూడా బ్యాంకులు విధించగా, దీనివల్ల తమ ఖాతాలను మరో బ్యాంకుకు మార్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని ఓ ఖాతాదారు అభిప్రాయపడ్డారు. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, ముఖ్యంగా టైర్-3 పట్టణాల్లోని బ్యాంకుల కస్టమర్లపై ఈ నిబంధనలు పెను ప్రభావాన్ని చూపుతాయని వాపోయారు. వ్యవస్థలో పెద్ద నోట్ల రద్దు తరువాత, ఇప్పటికీ ఏటీఎంలలో పూర్తి స్థాయిలో నగదు అందుబాటులో లేకపోగా, ఎంతో మంది లావాదేవీల కోసం బ్యాంకులకు వెళుతున్నారని, వారి జేబులకు మరింత చిల్లు పెట్టవద్దని కోరారు.