: కొత్త అసెంబ్లీలో దర్జాగా కూర్చున్న చంద్రబాబు.. పక్కనే నిలుచున్న అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణ మధ్య ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణిలతోపాటు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి చంద్రబాబు అసెంబ్లీ హాల్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా, భవనాన్నంతా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కొత్త భవనం అత్యంత సుందరంగా ముస్తాబవడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం, సభలో తనకు కేటాయించిన సీట్లో ఆయన కాసేపు దర్జాగా కూర్చున్నారు. భుజాన కండువా వేసుకుని, నవ్వులు చిందిస్తూ ఆయన కాసేపు కూర్చీలోనే ఉండిపోయారు. ఆ సమయంలో స్పీకర్ కోడెల, మండలి ఛైర్మన్ చక్రపాణిలు చంద్రబాబు పక్కనే నవ్వుతూ నిలబడ్డారు.