: మూడింట రెండు వంతులా? నాలుగింట మూడు వంతులా?... మా మెజారిటీపై ప్రస్తుతం ఇదే చర్చ: నరేంద్ర మోదీ


యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరిన వేళ, గెలిచేది తామేనన్న నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న చర్చ ఒకటేనని, బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందా? లేక నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధిస్తుందా? అన్న చర్చ జరుగుతోందని తెలిపారు.

"యూపీలో గతంలో ఎన్నడూ ఇలా ఏకపక్షంగా ఎన్నికలు సాగలేదు. ఇప్పటి వరకూ జరిగిన ఐదు దశల ఎన్నికల్లో విజయావకాశాలపై సందేహం లేదు. ఈ రాష్ట్రంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పడంలో సందేహం లేదు" అని డియోరియాలో జరిగిన ఓ ప్రచార సభలో మోదీ వ్యాఖ్యానించారు. "బావ్ జీ (మాయావతి) వెళ్లిపోయింది. భటీజా (అఖిలేష్) మరియు భటీజా కొత్త మిత్రుడు (రాహుల్) కూడా వెళ్లిపోయారు. వారికి ఏమీ మిగలదు" అని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో తమను ఓడించాలని సమాజ్ వాదీ, బీఎస్పీలు అనైతిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అవేమీ నిలబడలేదని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన ఏ హామీనీ సమాజ్ వాదీ నిలబెట్టుకోలేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని అన్నారు.

  • Loading...

More Telugu News