: బీజేపీ నేత జుహీని పట్టుకోవడానికి సన్యాసుల వేషంలో నాటకమాడిన సీఐడీ పోలీసులు


బాల బాలికల అక్రమ రవాణా, విక్రయాల కేసులో బీజేపీ మహిళా నేత జుహీ చౌదరిని అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు సన్యాసుల వేషంలో వెళ్లి నాటకమాడినట్టు తెలుస్తోంది. తనపై ఆరోపణలు వచ్చిన తరువాత జుహీ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, నేపాల్ సరిహద్దుల్లో డార్జిలింగ్ పరిధిలోని ఖారిబారీలో ఓ ఇంట తలదాచుకున్నట్టు తెలుసుకున్న పోలీసులు దాడులు జరిపి నిన్న అరెస్ట్ చేశారు. అమె అక్కడ ఉందని తెలుసుకున్న పోలీసులు, కాషాయ వస్త్రాలు ధరించి, సన్యాసులుగా మారి, అమె వర్గం వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఖారిబారీలోకి ప్రవేశించారు.

తొలుత ఆ ప్రాంతంలో సన్యాసుల వేషంలో రెక్కీ నిర్వహించి, జుహీ అక్కడే ఉందని తెలుసుకుని, ఆపై దాడులు జరిపారు. జుహీని కోర్టులో హాజరు పరచగా, 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. చిన్నారుల అమ్మకాల కేసులో ఆమెదే కీలక పాత్రని, ఈ కేసులో అన్ని నిజాలను అతి త్వరలో వెలుగులోకి తెస్తామని సీఐడీ పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News