: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోణీ కొట్టిన టీడీపీ


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టింది. చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థి బీఎన్ రాజసింహులు అలియాస్ దొరబాబు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆయనతో సహా ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో మంగళవారం నాడు ఇద్దరు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. మరో ఇద్దరి నామినేషన్లను పరిశీలనలో తిరస్కరించారు. ఇక్కడ బలం తక్కువగా ఉండటంతో వైసీపీ పోటీ చేయలేదు. దీంతో, రాజసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఈ ఫలితాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News