: ఆలియా భట్ ను చంపేస్తామని బెదిరింపులు: ఫిర్యాదు చేసిన మహేష్ భట్
రూ. 50 లక్షలు ఇవ్వకుంటే తన కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ను హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని దర్శక నిర్మాత మహేష్ భట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఓ గ్యాంగు లీడర్ నని చెప్పుకున్న ఓ వ్యక్తి చేసిన మొదటి ఫోన్ ను ఉత్తుత్తి బెదిరింపని వదిలేశానని, ఆపై వరుసగా వాట్స్ యాప్, ఎస్ఎంఎస్ లు పంపుతూ, తన మాటలను తేలికగా తీసుకోవద్దని అతను హెచ్చరించాడని, లక్నోకు చెందిన ఓ బ్యాంకు శాఖలో ఈ డబ్బు డిపాజిట్ చేయాలని సూచించాడని భట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆలియా, సోనీలను దారుణంగా చంపేస్తానని, వాళ్ల శరీరాల్లోకి బులెట్లను దింపుతానని అంటుండటంతో ఫిర్యాదు చేస్తున్నానని వివరించారు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మహేష్ భట్ నివాసం ప్రాంతంలో భద్రతను పెంచారు.