: కంటెంట్ ఉన్న నటుడు పవన్ కల్యాణ్: కరీనా కపూర్


బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. ఈ చిత్రం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న కరీనాను మీడియా పలకరించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ముఖ్యంగా దక్షిణాది సినిమాల గురించి ప్రస్తావించగా .. కరీనా స్పందిస్తూ, దక్షిణాదిన పవన్ కల్యాణ్ నుంచి రజనీకాంత్ వరకు చాలా గొప్ప నటులు ఉన్నారని, వారిలో కంటెంట్ కూడా ఉందని చెప్పింది. భాష సమస్య కారణంగా దక్షిణాది చిత్రాల్లో నటించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అయితే, మణిరత్నం దర్శకత్వంలో నటించిన ‘యువ’ సినిమాను తాను మర్చిపోలేనని కరీనా చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News