: జైలులో ఆ ఒక్క సౌకర్యం మాత్రమే శశికళకు కల్పించారట!
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నశశికళకు ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదట. ఈ విషయమై ఆరోపిస్తూ చెన్నైకి చెందిన న్యాయవాది ఒకరు సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పరప్పణ అగ్రహార జైలు డీఐజీ స్పందిస్తూ, ఏసీ, మంచం, పరుపు, వాటర్ హీటర్, ప్రత్యేక బాత్ రూమ్ ఏర్పాటు చేశారనేవి ఆరోపణలు మాత్రమేనని, కేవలం, టీవీ చూసేందుకు తప్పా, ఎటువంటి ఇతర సౌకర్యాలూ ఆమెకు కల్పించలేదని పేర్కొన్నారు. శశికళను తమిళనాడు జైలుకు తరలిస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. ఇందుకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు తమకు రాలేదని డీఐజీ స్పష్టం చేశారు.