: రెండో పెళ్లికి సిద్ధమైన దర్శకుడు.. అప్సెట్ అయిన కథానాయిక!
సినీ ప్రేమ జంట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, నటి అమలా పాల్ అధికారికంగా ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ మళ్లీ పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ తండ్రి అళగప్పన్ తన కొడుక్కి మంచి సంబంధాలు చూస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అమలాపాల్ కు ఈ విషయం తెలియడంతో ఆమె ఉద్వేగానికి గురైందట. కాగా, 2011లో 'దైవ మరుగళ్' చిత్రం షూటింగ్ సమయంలో అమలాపాల్, విజయ్ ల ప్రేమ వ్యవహారం మొదలైంది. 2014 జూన్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని 2016 లో వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. .