: జగన్ పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరతాం!: ఐఏఎస్ ఆఫీసర్ ఏకే ఫరీదా
కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు, ఐఏఎస్ లు ఇప్పటికే స్పందించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ ఆఫీసర్ ఏకే ఫరీదా మాట్లాడుతూ, ఓ కలెక్టర్ ను జైలుకు పంపుతామని జగన్ ఎలా అంటారు? అని ప్రశ్నించారు. వ్యవస్థలో అధికారులు కీలకమని, అధికారులను కించపరిచిన వారిని ప్రజలు గౌరవించరని అన్నారు. కలెక్టర్ బాబును జైలుకు పంపుతానంటూ వ్యాఖ్యానించిన జగన్ పై చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై సీఎం చంద్రబాబును కలుస్తామని ఫరీదా పేర్కొన్నారు. కాగా, దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను పరామర్శించేందుకు కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి కి వైఎస్సార్సీపీ అధినేత జగన్ వెళ్లిన సందర్భంలో కలెక్టర్ పై ఈ వ్యాఖ్యలు చేశారు.