: ప్రొటోకాల్ వివాదం.. కరీంనగర్ కలెక్టర్ పై ఎమ్మెల్యేల ఆగ్రహం!


కరీంనగర్ లో ఈ రోజు నిర్వహించిన డిజిధన్ మేళాలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ వినోద్ కుమార్ చిత్రం లేదంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాల కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై కూర్చునేందుకు వారు నిరాకరించారు. దీంతో, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కల్పించుకోవాల్సి వచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఈటల నచ్చచెప్పడంతో కార్యక్రమం సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News