: ఆ సినిమాతోనే సూపర్ స్టార్ ని అవుతాననుకున్నా.. కాలేకపోయా!: యంగ్ హీరో విజయ్ దేవరకొండ
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో రిషి పాత్ర చేస్తున్నప్పుడే తానో సూపర్ స్టార్ ని అవుతానని అనుకున్నానని, అయితే, ఆ విధంగా కాలేకపోయానని యువ నటుడు విజయ్ దేవరకొండ చెప్పాడు. విజయ్ నటించిన కొత్త చిత్రం ‘ద్వారక’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు ద్వారకలో శ్రీకృష్ణుడి లీలల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, ఈ చిత్రంలో తాను రెండు పాత్రలు పోషిస్తున్నానని చెప్పాడు.
దేవుడిని నమ్ముతానని, చాలా విషయాలకు సమాధానాలు లేవని, వాటి జవాబులు దేవుడికే తెలుసనేది తన అభిప్రాయమని అన్నాడు. ఒకవేళ, తన ప్రశ్నలకు జవాబులు దొరికితే దేవుడిని పూజించడం మానేస్తానని చెప్పిన విజయ్, క్రికెట్, వాలీబాల్ క్రీడలు అంటే తనకు ఇష్టమని, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మిత్రులతో కలిసి ఆడుకుంటానని చెప్పుకొచ్చాడు.