: ‘బాహుబలి-2’ ను వీక్షించనున్న ప్రధాని మోదీ, బ్రిటిష్ రాణి ?


ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం తెరకెక్కించిన ‘బాహుబలి : ది బిగినింగ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ కూడా త్వరలో విడుదల కానుంది. అయితే, స్వతంత్ర భారతదేశం డెబ్భై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 24న బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రదర్శించనున్న పలు భారతీయ చిత్రాలలో ‘బాహుబలి -2’ కూడా ఉంది. ‘బాహుబలి -2’ ప్రీమియర్ షో ను మన ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 వీక్షించనున్నట్లు సమాచారం. అయితే, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News