: వాస్తవాలు వెల్లడవుతాయన్న భయంతోనే పోస్టుమార్టం చేయలేదు: అంబటి రాంబాబు
కృష్ణాజిల్లాలోని నందిగామ ప్రభుత్వాసుపత్రిలో నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ.. దివాకర్ ట్రావెల్స్‌పై కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదని ఆయన అన్నారు. వాస్తవాలు వెల్లడవుతాయన్న భయంతోనే పోస్టుమార్టం చేయలేదని ఆయన తెలిపారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబుకు అలవాటైందని ఆయన అన్నారు.