: జగన్ పై అక్రమ కేసులకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు: పార్థసారథి


దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృత దేహాలను ఎంతో త్వరగా వాళ్ల ఇళ్లకు పంపడం పట్ల టీడీపీ ప్రభుత్వం ఎంతో చొరవ చూపిందని... దీని వెనకున్న కారణం ఏమిటో చెప్పాలని వైసీపీ నేత పార్థసారథి డిమాండ్ చేశారు. డ్రైవర్ మృతదేహాన్ని పరీక్షించకుండా అక్కడ నుంచి తరలించారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు విపక్షాలకు, ప్రజలకు ఉండదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించేవారి భద్రత ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. వీటన్నింటినీ ప్రశ్నించిన తమ అధినేత జగన్ పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. జగన్ పై అక్రమ కేసులను నిరసిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని తమ పార్టీ శ్రేణులకు పార్థసారథి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News