: అనుమానంతో కూతుళ్లకు డ్రగ్స్ ఇచ్చి కాలువలోకి తోసేసిన తల్లిదండ్రులు.. ఒకరి మృతి
పదవ తరగతి చదువుతున్న తన కూతుళ్లు ఇద్దరు రాత్రి పూట ఇంటికి ఆలస్యంగా రావడంతో వారికి బోయ్‌ఫ్రెండ్లు ఉన్నారని అనుమానించిన వారి తల్లిదండ్రులు వారిద్దరిపై దారుణానికి పాల్పడ్డ ఘటన పంజాబ్‌లోని లూథియానాలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ ఉదయ్ చంద్, అతడి భార్య లక్ష్మి కలిసి తమ కూతుళ్లకు డ్రగ్స్ ఇచ్చి, అనంతరం వారిని కాలువలోకి తోసేసి, అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఒక కూతురు మృతి చెందగా, మరో కూతురు ప్రీతి స్వల్ప గాయాలతో బయటపడింది. నిందితులపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదుచేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.