: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మంత్రులను, ఐఏఎస్‌లను జైలుకు పంపిన ఘనత జగన్ ది!: ఎమ్మెల్యే యరపతినేని
బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రవర్తించిన తీరుపై టీడీపీ నేతలు ఆయనపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ జగన్ తీరుపై మండిపడ్డారు. జగన్ సైకోతనం మరోసారి బయటపడిందని ఆయన అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మంత్రులను, ఐఏఎస్‌లను జైలుకు పంపిన ఘనత జగన్ దేనని ఆయన వ్యాఖ్యానించారు. సరస్వతి భూములలో జగన్ జరిపిన దమనకాండని రైతులు ఎప్పటికీ మర్చిపోరని ఆయన విమర్శించారు. తాము చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రల ద్వారా ఆ పార్టీ తీరుని ఎండగడతామని చెప్పారు.