: పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు.. రైలు కింద పడ్డాడు!
ట్రైన్‌లో ల్యాప్‌ట్యాప్ చోరీ చేసిన ఆరోపణలు ఎదుర్కొని పోలీసులకి చిక్కిన ఓ నిందితుడు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పారిపోతూ పట్టాలు దాటుతుండగా గూడ్స్‌రైలు ఢీకొట్టడంతో కాళ్లు కోల్పోయాడు. కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్‌లో కుమార్ అనే వక్తి నిన్న రాత్రి రన్నింగ్ ట్రైన్‌లో ల్యాప్‌ట్యాప్ చోరీ చేశాడని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డోన్ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కుమార్ ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో పారిపోయేందుకు యత్నిస్తూ రైలు కిందపడ్డాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.