: చూడు బాలీవుడ్... నా కూతురు వచ్చేస్తోంది మరి!: డేవిడ్ వార్నర్


పూణేలో జ‌రిగిన మొద‌టి టెస్టులో టీమిండియాపై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ఆస్ట్రేలియా జట్టు మంచి హుషారు మీద ఉంది. ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు ఆనందంగా క‌నిపిస్తున్నారు. ఆ జట్టు ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్ తన కూతురు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఆస‌క్తిక‌ర స‌వాలు విసిరాడు. ఈ నెల 4న బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియాల మ‌ధ్య‌ రెండో టెస్టు మ్యాచు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా వార్నర్ త‌న భార్య, కుమార్తెతో స‌రదాగా గడిపాడు. త‌న చిట్టి కూతురు ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేయడం చూసిన‌ వార్నర్ ఆమె ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘‘నా కూతురు ఇవీ మరోసారి మాకు వినోదాన్ని పంచింది.. చూడు బాలీవుడ్... ఆమె వచ్చేస్తోంది మరి... ’’ అంటూ ఆయ‌న అందులో సరదాగా హెచ్చరించాడు.


  • Loading...

More Telugu News