: 2013 నంది అవార్డుల ప్రకటన వివరాలు.. ఉత్తమ నటుడు ప్రభాస్, నటి అంజలి
2012-13 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనున్న నంది అవార్డులను ఈ రోజు ప్రకటించారు. 2012 నంది పురస్కారాల వివరాలను సినీనటి జయసుధ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం 2013 సంవత్సరానికి గానూ నంది అవార్డులను కమిటీ చైర్మన్, దర్శకుడు కోడి రామకృష్ణ ప్రకటించారు. మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలకు అత్యధికంగా అవార్డులు వచ్చాయి.
* ఉత్తమ చిత్రం- మిర్చి
* ఉత్తమ రెండో చిత్రం- నా బంగారు తల్లి
* ఉత్తమ మూడో చిత్రం- ఉయ్యాల జంపాల
* ఉత్తమ కుటుంబ కథా చిత్రం-సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
* ఉత్తమ నటుడు- ప్రభాస్ (మిర్చి)
* ఉత్తమ నటి-అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
* ఉత్తమ సహాయనటుడు- ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
* మోస్ట్ పాప్యులర్ సినిమా- అత్తారింటికి దారేది
* ఉత్తమ హాస్యనటుడు-తాగుబోతు రమేష్ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)