: తెలంగాణలో నామినేటెడ్ పదవుల పందేరం... 10 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు వీరే
టీఆర్ఎస్ నాయకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల పంపకం మొదలైంది. 10 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తూ, సీఎం కేసీఆర్ కొద్దిసేపటిక్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సెట్విన్ చైర్మన్ గా ఇనాయత్ అలీని నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా షేక్ బుడాన్ బేగ్, సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొండబాల కోటేశ్వరరావు, నెడ్ క్యాప్ చైర్మన్ గా అబ్దుల్ అలీమ్, ఖాదీ బోర్డు చైర్మన్ గా మహమ్మద్ యూసఫ్ జహీద్, అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా విప్లవ్ కుమార్, గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తాటి వెంకటేశ్వర్లు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సయ్యద్ అక్బర్ హుస్సేన్, హ్యాండీ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సంపత్ కుమార్ గుప్తా, ఎడ్యుకేషన్ అండ్ వెల్ ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌండ్ల నాగేందర్ గౌడ్ లను కేసీఆర్ నియమించారు.