: ఇప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని: యాంకర్ శ్యామల


బుల్లి తెరపైనే కాకుండా, టాలీవుడ్ ఫంక్షన్లలో కూడా సందడి చేస్తున్న యాంకర్ శ్యామల ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. తొమ్మిది నెలలు ఎప్పుడెప్పుడు నిండుతాయో అంటూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ అమ్మడు తెలిపింది. ఐదో నెల నిండాక కొన్ని నెలల పాటు యాంకరింగ్ కు దూరంగా ఉంటానని చెప్పింది. అంతేకాదు, పుట్టబోయే బిడ్డకు అప్పుడే పేరు కూడా డిసైడ్ చేసేశారట. అబ్బాయి పుడితే 'ఇషాన్' అనే పేరు పెడతారట. అమ్మాయి పుడితే మాత్రం ఏం పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించలేదని శ్యామల చెప్పింది. బుల్లి తెర నటుడు నరసింహారెడ్డిని శ్యామల ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఆరేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది.

  • Loading...

More Telugu News