: తెలుగు రాష్ట్రాల్లో ఇక నాలుగు నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకోగలిగే రైళ్ల వివరాలు


ప్రత్యేక చార్జీలతో నడిచే రైళ్లు, సువిధ రైళ్లలో ప్రస్తుతం 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉండగా, రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ఆ అవధిని 120 రోజులకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లలో ఇకపై నాలుగు నెలల ముందుగానే రిజర్వేషన్లు చేయించుకోవచ్చని రైల్వే సీపీఆర్ఓ ఉమా శంకర్ కుమార్ వెల్లడించారు.
నాలుగు నెలల ముందుగా రిజర్వేషన్ అమలయ్యే తెలుగు రాష్ట్రాల రైళ్ల వివరాలివి
* రైలు నంబర్ 07115 - హైదరాబాద్ నుంచి కొచువేలి
* రైలు నంబర్ 07757 - సికింద్రాబాద్ నుంచి విజయవాడ
* రైలు నంబర్ 07758 - విజయవాడ నుంచి హైదరాబాద్
* రైలు నంబర్ 07438 - కాచిగూడ నుంచి టాటానగర్
* రైలు నంబర్ 08574 - తిరుపతి నుంచి విశాఖపట్నం
* రైలు నంబర్ 08502 - సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం
* రైలు నంబర్ 07149 - సికింద్రాబాద్ నుంచి గౌహతి
* రైలు నంబర్ 07607 - హెచ్ఎస్ నాందేడ్ నుంచి తిరుపతి
* రైలు నంబర్ 07608 - తిరుపతి నుంచి హెచ్ఎస్ నాందేడ్
* రైలు నంబర్ 07417 - తిరుపతి నుంచి నాగర్ సోల్
* రైలు నంబర్ 07418 - నాగర్ సోల్ నుంచి తిరుపతి

  • Loading...

More Telugu News