: కలెక్టర్ బాబుకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుకు ఏపీ సీఎం చంద్రబాబు మద్దతుగా నిలిచారు. ఆయన సమర్థవంతమైన అధికారని కితాబిచ్చారు. ఆయన్ను ఉద్దేశించి విపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవని, ఓ కలెక్టర్ ను జైలుకు పంపుతామని ఆయన బెదిరించడం ఎంతమాత్రం క్షమార్హం కాదని అన్నారు. బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరమైన ఘటనని, ప్రాణాలు పోవడాన్ని ఎవరూ హర్షించరని చెప్పిన ఆయన, ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం జగన్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. కలెక్టర్ బాబు వల్లే కృష్ణా జిల్లాకు అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.