: అమెరికా, యూకే, ఫ్రాన్స్‌లు ప్రవేశపెట్టిన తీర్మానానికి మరోసారి అడ్డుపడ్డ రష్యా, చైనా


ప్రజలపై రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలు రావడంతో సిరియాపై అమెరికా, యూకే, ఫ్రాన్స్‌లు ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఆంక్ష‌ల తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, సిరియాపై విధించిన ఆంక్ష‌ల‌ను మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌స్తోన్న ర‌ష్యా మ‌రోసారి అదే తీరుని క‌నబ‌ర్చ‌గా మ‌రోవైపు చైనా కూడా ఆ తీర్మానాన్ని మ‌రోసారి వీటో చేసింది. సిరియా ప్రభుత్వానికి రష్యా ఎప్ప‌టినుంచో మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. చైనా కూడా గతంలో ఆరు సార్లు సిరియాపై విధించిన ఆంక్షలను వీటో చేసింది. 1997 నుంచి క్లోరిన్‌ గ్యాస్‌ను వినియోగించడంపై నిషేధం ఉంది. అయితే,  2014-15 మధ్య కాలంలో సిరియా ప్రజలపైనే రసాయనిక ఆయుధాలను వినియోగించినట్లు కెమికల్‌ వెపన్స్‌ వాచ్‌డాగ్ గుర్తించింది. సిరియాపై ఈ ఆంక్ష‌లు అమ‌లైతే హెలికాప్టర్ల విక్రయంపై నిషేధం, 11 మంది అధికారులు, 10 బృందాలపై ఆంక్షలు విధిస్తారు.

  • Loading...

More Telugu News