: వైకాపాలో చేరిన బీజేపీ నేత
హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ నేత ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో తనను కలిసిన మోహన్ రాజును, పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆపై జగన్ సమక్షంలో పార్టీ సభ్యత్వాన్ని ఆయన తీసుకున్నారు. మోహన్ రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు, ఆయన అనుచరులు వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపక్ష నేతగా జగన్ చేస్తున్న పోరాటం, ప్రజలకు అండగా నిలుస్తున్న వైనం తనకు స్ఫూర్తి నిచ్చాయని అన్నారు. వైకాపా బలోపేతానికి తాను కృషి చేస్తానని చెప్పారు. జగన్ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తానని స్పష్టం చేశారు.