: ట్రంప్ నిర్ణయంతో 75వేల మంది మానసిక రోగుల చేతుల్లోకి తుపాకులు!


అమెరికాలో విదేశీయులపై కొనసాగుతున్న దాడులను ఖండించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... అత్యంత దారుణమైన ఓ నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. మానసిక రోగులు కూడా తుపాకులు కొనుక్కోవచ్చనే కొత్త రూల్ ను పాస్ చేశారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 75,000 మంది మానసిక రోగులకు తుపాకులు కొనుక్కునే అవకాశం లభిస్తుంది.

మానసిక రోగులు తుపాకులు కొనుక్కోకుండా ఒబామా సర్కారు గతంలో నిషేధం విధించింది. వీరి తుపాకీ లైసెన్సులను రద్దు చేసింది. 2012లో ఓ మానసిక రోగి 20 మంది విద్యార్థులను కాల్చి చంపడంతో, ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికాలో జాత్యహంకార దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో, మానసిక రోగులకు మళ్లీ తుపాకులు ఇవ్వాలన్న తీవ్ర నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. ఒబామా నిర్ణయాన్ని మార్చాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, సెనేట్ లు నిర్ణయించాయని... దీనికి సంబంధించిన బిల్లు వారం క్రితమే పాస్ అయిందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News