: మహేష్ బాబుపై నమ్రత అభిప్రాయం ఇదే!
మహారాష్ట్రలో పుట్టి, పెరిగి మంచి నటిగా గుర్తింపు పొందిన నమ్రత శిరోద్కర్... ప్రిన్స్ మహేష్ బాబును పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలుగా భాగ్యనగరిలో సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత తన సీనీ కెరీర్ ను పక్కన పెట్టి, తన సమయాన్ని మొత్తం కుటుంబానికే కేటాయిస్తోంది. మంచి గృహిణిగా, భార్యగా, అమ్మగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఈ నేపథ్యంలో, ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన భర్త మహేష్ పై ప్రశంసలు కురిపించింది. తన కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం మహేష్ ఏమైనా చేస్తాడని నమ్రత కితాబిచ్చింది. తన తల్లిదండ్రులంటే మహేష్ కు అమితమైన ప్రేమ అని చెప్పింది. మహేష్ ఒక గొప్ప కొడుకు అని తెలిపింది. అంతకు మించి గొప్ప తండ్రి కూడా అంటూ ప్రశంసించింది.
గౌతమ్ పుట్టిన కొన్నాళ్లకు తన తల్లిదండ్రులు చనిపోయారని... ఆ సమయంలో 'ఖలేజా' సినిమా షూటింగ్ ను కూడా కొన్ని రోజుల పాటు క్యాన్సిల్ చేసుకుని, మహేష్ తనకు అండగా ఉన్నాడని నమ్రత తెలిపింది. సినిమాల పరంగా మహేష్ ఒక గొప్ప నటుడని... అన్నింటికీ మించి మంచి మనసుగలవాడని చెప్పింది. మహేష్ అంటే తనకు అమితమైన ప్రేమ అని... మహేష్ తనకు పరిచయం కావడమే, తన జీవితంలో గొప్ప సంఘటన అని తెలిపింది.