: హాల్ టికెట్లు అందని వాసవీ కాలేజి విద్యార్థులకు అభయమిచ్చిన ప్రభుత్వం!


ప్రభుత్వ గుర్తింపు లేకుండా పనిచేస్తూ, ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న హైదరాబాద్, వనస్థలిపురం వాసవీ కాలేజ్ పై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్షలు మొదలైనా తమకు హాల్ టికెట్లు రాలేదని ధర్నాకు దిగిన విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి కడియం శ్రీహరి అభయమిచ్చారు. వాసవీ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరికీ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులు నిరసనలు విరమించాలని, ఇప్పటికే వాసవీ కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి ఆ కాలేజీ అనుమతులు తీసుకోనందునే విద్యార్థుల పేర్లు నమోదు కాలేదని స్పష్టం చేస్తూ, అయినప్పటికీ, పిల్లల భవిష్యత్తు కోసం అందరికీ హాల్ టికెట్లు ఇచ్చి సప్లిమెంటరీ రాయిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News