: ఎట్టకేలకు కాన్సస్ కాల్పుల ఘటనపై స్పందించిన ట్రంప్!


కాన్సస్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ఎట్టకేలకు స్పందించారు. ఇంత జరిగినా ఒక్కమాట కూడా మాట్లాడలేదంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో చివరికి స్పందించారు. అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన 40 రోజుల తర్వాత తొలిసారిగా అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. శ్రీనివాస్ హత్యను ఖండించారు. దేశంలో ఇటువంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే అమెరికా అతి శక్తిమంతమైన దేశమని, అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. అమెరికన్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారికి ఉద్యోగాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. కంపెనీలు వెనక్కి వస్తున్నాయని పేర్కొన్న ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శలు చేశారు. ఆయన హయాంలో దేశంలో ఉగ్రదాడులు పెరిగాయని ఆరోపించారు. దేశంలో డ్రగ్స్‌ను అరికడతామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News