: హైదరాబాద్‌లో ఆ మార్గాల్లో ప్రయాణించొద్దు.. వాహనదారులకు ట్రాఫిక్ అడిషనల్ సీపీ సూచన
హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్ పలు సూచనలు చేశారు. నగరంలోని గ్రీన్‌లాండ్స్ క్రాస్‌రోడ్(మీనా జువెల్లర్స్) వద్ద మెట్రో నిర్మాణ పనులు ప్రారంభించనుండడంతో ఆ మార్గం ద్వారా ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. మెట్రో నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ప్రధాన జంక్షన్ కావడంతో, పంజగుట్ట, రాజ్‌భవన్‌రోడ్, కుందన్‌బాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు, ప్రయాణికులు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ పిల్లర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్టు సీపీ తెలిపారు. కాబట్టి నేటి నుంచి ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ మార్గంలో ప్రయాణించే వారు రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జితేందర్ విజ్ఞప్తి చేశారు.