: 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' ట్వీటుపై వివరణ ఇచ్చుకున్న సెహ్వాగ్


ఢిల్లీ యూనివర్శిటీ ప‌రిధిలోని రాంజాస్ కాలేజీలో ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్‌ విద్యార్థి సంఘాల మధ్య పోటా పోటీ ర్యాలీలు జ‌రుగుతున్న నేపథ్యంలో విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ 'మా నాన్నను పాకిస్థాన్ చంపలేదు... యుద్ధం చంపింది' అంటూ చేసిన పోస్టు క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఆమె చేసిన ఈ పోస్టుపై పలువురు భ‌గ్గుమంటున్నారు. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ఆమెకు కౌంటర్ ఇస్తూ 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ పోస్టు చేశారు. అయితే, ఆయ‌న చేసిన ట్వీటుపై వివాదం చెల‌రేగుతుండ‌డంతో సెహ్వాగ్ మ‌రోసారి స్పందించారు. తన మాటలను, తన ఉద్దేశాన్ని తప్పుబట్టారని, తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయ‌న మీడియాకు చెప్పారు. త‌న‌ ట్వీట్ ఆ విద్యార్థినిని ఉద్దేశించి చేసింది కాద‌ని, అది చిన్న సరదాకు మాత్రమే పెట్టానని, కానీ ప్రజలు దానిని వేరేలా అర్థం చేసుకున్నార‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News